ముగించు

గ్రామము & పంచాయితీలు

పంచాయతీరాజ్ శాఖ యొక్క ప్రధాన లక్షం గ్రామీణ ప్రజలకు కనీస పౌర సౌకర్యాలు కల్పించుట.

పౌర సౌకర్యాలు

పరిశుభ్రత , మంచి నిటి సౌకర్యము కల్పనా, విధి దీపాలు మరియు గ్రామం లోపల మరియు వెలుపల,  ఆదాయ లభ్యత మేరకు సదుపాయాల కల్పనా. వీటితో పాటు జిల్లా పరిపాలనా విభాగము మరియు ప్రభుత్వం వారు చేపట్టిన వివిధ కార్యక్రమాలు చేపట్టుట, ఎన్.టి.ఆర్ భరోసా పెన్షన్, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణము మొదలగునవి.

గ్రామ పంచాయతీ యొక్క ఆదాయ వనరులు:

ఇంటిపన్ను, చేపల చెరువుల లిజులు, మార్కెట్ కిస్తిలు, లే అవుట్ మరియు భవానాల ఫీజు, కబీర్ మొ.నవి. 1 4 వ ఆర్ధిక సంఘం గ్రాంటులు ప్రభుత్వం ద్వారా పంచాయితీలకు పంపబడిన అభివృద్ధి నిధులు, నిబంధనల మేరకు చేపట్టుట.

పంచాయితీ సెక్రటరి వ్యవస్థను 2002 సం.లో ప్రభుత్వం తిసుకోచ్చుట మరియు జి.ఓ నెం 295,  పి & ఆర్.డి తేది 2007 ద్వారా వారి విధులను చూపించుట జరిగినది. ఈయన తదుపరి ఉన్నతాధికారి ఎక్స్ టెన్షన్ అధికారి (పి.ఆర్ & ఆర్.డి) మరియు ఈయన లా మరియు నిబంధనలను సక్రమముగా ఉండునట్లు చూచుట,  గ్రామములో పరిపాలన సక్రమముగా నిర్వహించునట్లు చూచుట.

తదుపరి అధికారిగా డివిజనల్ పంచాయితీ అధికారి, ఆపైన జిల్లా పంచాయితీ అధికారి వారు ఉంటారు . వీరు తరచుగా గ్రామ పంచాయితీలను తనిఖి చేయుట మరియు గ్రామ పరిపాలన సక్రమముగా ఉండేటట్లు చూచుట.

గ్రామంలో నివసిస్తున్న గ్రామా ప్రజలకు రోజు వారి అవసరాలైన పరిశుభ్రత, మంచి నిటి సౌకర్యం, విధి దీపాలు  ఏర్పాటు చేయుట అనునది ప్రధానమైన విధి. వీటితో పాటు అవసరమైన అన్ని నిధులు సమీకరించుట.

దీని కొరకు, గ్రామ పంచాయితీలు డ్రైనేజి, పన్ను, గ్రామ పంచాయితీ పరిధిలో నెలకొల్పబడిన హోర్డింగులపై ప్రచార పన్ను విధించుట జరుగుచున్నది