ముగించు

మండలాలు

మండలాలు  :

సబ్ డివిజన్ ను మండలాలుగా విభజించారు. విశాఖపట్నం జిల్లాలో 43 మండలాలు కలవు. మండలానికి తహశీల్దారు / మండల రెవిన్యూ అధికారి అధిపతిగా ఉండును.

మండల రెవిన్యూ అధికారికి పూర్వపు తాలూకాలలో ఉన్న తహశిల్దారుకున్న విధులు మరియు అధికారములు కల్గి ఉండును. మండల రెవెన్యూ అధికారి మండలానికి అధిపతి. మండల రెవిన్యూ అధికారి ప్రభుత్వానికి మరియు ప్రజలకు మధ్య వారధిగా ఆయన పరిదివరకు ఉండును. ఈయన పరిధిలో సంక్షేమ పధకాలు అమలు చేయుట మరియు పర్యవేక్షించుట జరుగును. సమాచార సేకరణ తనిఖీలు మరియు విచారణలు చేపట్టుటలో ఉన్నతాధికారులకు మండల రెవిన్యూ అధికారి సహాయపడును. ఇతను జిల్లా పరిపాలనా విభాగం వారికి సమాచారం అందజేయడం జరుగుతుంది. ఇది వివిధ స్థాయి అధికార్లు నిర్ణయాలు తీసుకోవటం కొరకు సహాయకారిగా ఉండును.

ఉప తహశీల్దారు / సూపరింటెండెంట్ మండల రెవిన్యూ కార్యాలయములో జరుగు రోజు వారి కార్యక్రమములను పర్యవేక్షిస్తారు. మరియు వేరు ప్రధానంగా సాధారణ పరిపాలనను పర్యవేక్షిస్తారు.. చాల దస్త్రములు ఈయన ద్వారానే మదింపు చేయబడును. ఇతను మండల రెవెన్యూ కార్యాలయములో గల అన్ని శాఖల పనితీరును పర్యవేక్షిస్తారు.

మండల రెవిన్యూ ఇన్ స్పెక్టర్ / విచారణాదికారి సంబంధిత మండల రెవిన్యూ అధికారి వారికి తనిఖి మరియు విచారణ చేపట్టుటలో సహాయకుడిగా ఉండును. ఈయన గ్రామ సేవకులు / సెక్రటరిలను పర్యవేక్షిస్తారు. ఈయన వ్యవసాయ పంటల పర్యవేక్షణ, పహానిలో సహరాస్ ( క్షేత్ర విచారణ వివరాలు) వ్రాస్తారు, భూ ఆదాయ వసూలు చేయుట, వ్యవసాయేదిక భూమి వివరాల సేకరణ / నిర్దారణ మరియు మిగిలిన పనులు చూస్తారు. అతని పరిధిలో గల గ్రామములో లా అండ్ ఆర్డర్ సక్రమంగా అమలు అయ్యేటట్లు చూచుట ఈయన విధి.

జిల్లాలో ముఖ్య ప్రణాళకాదికారి మరియు రాష్ట్రంలో డైరక్టర్, ఆదాయక గణాంక కార్యాలయ పరిధిలో గల సహాయ గణాంక అధికారి (ఎ.ఎస్.ఓ) మండలాలలో గల జనాభా, వ్యవసాయము మరియు వర్షపాతంనకు సంబంధించిన వివరాలు సేకరించును. ఈయన పంటల దిగుబడి / వంగడాల దిగుబడి పరీక్షలు నిర్వహించేందరు. ఇతను పంటలను పర్యవేక్షించి పంటల స్థితిగతులు వివరాలను అందజేయును. ఇతను జనన మరియు మరణాల నివీదికలు తయారు చేయుట మరియు మండల రెవిన్యూ అధికారి వారికి పంట దిగుబడులు, నిల్వ వివరాలు,, జనాభా నియంత్రణ వివరాలు మరియు ప్రభుత్వం వారు చేపట్టిన సర్వేలు చేయడం, వివరాలు సేకరణలో సహాయపడుదురు.ఈ నివేదిక మండల రెవిన్యూ అధికారి జిల్లా కలక్టర్ కు సమర్పించెదరు. తదుపరి వీటిని ప్రభుత్వ స్థాయిలో డైరక్టర్, ఆదాయ మరియు గణాంక శాఖ మరియు ప్రణాళిక శాకకు పంపుట జరుగును.

సర్వే సెటిల్ మెంట్ మరియు భూ రికార్డుల శాకకు చెందిన మండల సర్వేయర్, సర్వే నిర్వహించుట లో మండల రెవిన్యూ అధికారి వారికి సహాయపడుడురు. మండల సర్వేయర్ విధులు నిర్వహించుటలో చైన్ మెన్ సహాయపడుడురు.

పరిపాలనా సౌలభ్యం కొరకు తహశీల్దారు కార్యాలయములో వివిధ విభాగాలు.

  1. సెక్షన్ – ఎ       :  కార్యాలయ నిర్వహణ మరియు ఆర్ధిక కార్యక్రమములు
  2. సెక్షన్ – బి        :  భూములకు సంబంధించిన వ్యవహారాలు
  3. సెక్షన్ – సి        : పౌర సరఫరాల శాఖ, పెన్షన్ పధకాలు మొదలగునవి.
  4. సెక్షన్ – డి        : ఎస్టాబ్లిష్ మెంట్, ప్రకృతి వైపరీత్యాలు మొదలగునవి
  5. సెక్షన్ – ఇ        : కుల ధృవీకరణ, ఆదాయ, నివాస పత్రాల్ జారి జేయుట మొ.నవి

డివిజన్ వైజ్ మండలాలు

క్రమ సంఖ్య డివిజన్ పేరు మండలం పేరు
1 అనకాపల్లి అనకాపల్లి
2 అనకాపల్లి అత్చుతాపురం
3 అనకాపల్లి బుట్చయ్యపేట
4 నర్సీపట్నం చీడికాడ
5 అనకాపల్లి చోడవరం
6 అనకాపల్లి దేవరాపల్లి
7 అనకాపల్లి ఎలమంచిలి
8 అనకాపల్లి కె.కోటపాడు
9 అనకాపల్లి కశింకోట
10 నర్సీపట్నం మాడుగుల
11 అనకాపల్లి మునగపాక
12 అనకాపల్లి రాంబిల్లి
13 అనకాపల్లి సబ్బవరం
14 అనకాపల్లి పరవాడ
15 నర్సీపట్నం గొలుగొండ
16 నర్సీపట్నం కోటఉరట్ల
17 నర్సీపట్నం మాకవరపాలెం
18 నర్సీపట్నం నక్కపల్లి
19 నర్సీపట్నం నర్సీపట్నం
20 నర్సీపట్నం నాతవరం
21 నర్సీపట్నం పాయకరావుపేట
22 నర్సీపట్నం రావికమతం
23 నర్సీపట్నం రోలుగుంట
24 నర్సీపట్నం ఎస్.రాయవరం